Recent Visitors: PALMOO DELHI_GUY1986 mani1885 pinksy ovijit1 bkreddy007 Naaz6666 ankit1210 jai_22 honeyluck honey1kalyani
feeling peppy
VANTAGE
saakshi-my heart
అకస్మాత్తుగా అంతరంగం నీ చిత్రపటాన్ని
ఆవిష్కరించేసరికి,
ఒక్కసారిగా మలయమారుతం మనసు కొమ్మలను ఊపేసినట్లు ఉంది.
చిమ్మచీకటి వెలుగై మరులుగొలిపేసరికి,
పూడ్చిపెట్టిన ఆశలు నిలువెత్తు జలపాతమై ఉరికినట్లుంది .
నీ జ్ఞాపకాలు యెదను గిలిగింతలు పెట్టెసరికి ,
వశీకరించబడి నీ చుట్లే తిరుగుతున్నట్లుంది.
విచారం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది ,
నైరాశ్యం నను విడిచావెందుకని నిందిస్తూ జారిపోయింది.
చెక్కుచెదరని కఠినత్వం నీ ముందు ముక్కలైపోయింది,
ప్రేమ సౌందర్యనికి ముచ్చటపడిపోయింది.
ఇంధ్రధనుస్సై మేను మెరిసింది,
మనసు కర్పూరమై వెలిగి కరిగింది,
నీ హస్తాక్షరానికి సాక్షిగా నిలిచింది............
Tags :

















ankit1210 dnt knw dis language will u tell me wats written so dat i could understand ur blog